Misc Praise Songs – Santhoshamutho Nichchedu Vaarini (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Chorus]
F          Bb     C
సంతోషముతో నిచ్చెడు వారిని

F           C      F
నెంతో దేవుడు ప్రేమించెన్

F            Bb
వింతగ వలసిన-దంతయు నొసంగును

Dm             C
వినయ మనసుగల విశ్వాసులకును
[Verse 1]
F        Bb    C
అత్యాసక్తితో నధిక ప్రేమతో

F           C      F
నంధకార జను-లందరకు

F            Bb
సత్య సువార్తను జాటించుటకై

Dm             C
సతతము దిరిగెడు సద్భక్తులకు
[Verse 2]
F            Bb    C
వేద వాక్యమును వేరు వేరు గా

F              C     F
మాదుల నుండెడు బాలురకు

F               Bb
సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి

Dm        C
సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు
[Verse 3]
F         Bb     C
దిక్కెవ్వరు లేకుండెడి దీనుల

F            C     F
తక్కువ లన్నిటి దీర్చుటకై

F            Bb
నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు

Dm          C
ప్రక్కలలో బ్రక-టించుట కొరకై
[Verse 4]
F          Bb      C
ఇయ్యండీ మీ కీయం బడు నని

F               C     F
యియ్యంగల ప్రభు యే-సనెను

F             Bb
ఇయ్యది మరువక మదిని నుంచుకొని

Dm              C
యియ్యవలెను మన యీవుల నికను
[Verse 5]
F            Bb         C
భక్తి గలిగి ప్రభు పని కిచ్చుఁట బహు

F               C    F
యుక్త మటంచు ను-దారతతో

F            Bb
శక్తి కొలది మన భుక్తి నుండి యా

Dm           C
శక్తితో నిరతము నియ్య వలెను